8 కోట్లతో సినిమా .. 80 కోట్లకి పైగా వసూళ్లు! ఆలోచింపజేస్తున్న సందేశం..
Fri Jun 13, 2025 15:23 Entertainment
మలయాళంలో క్రితం ఏడాది ఆరంభంలో వచ్చిన 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' .. 'భ్రమయుగం' సినిమాలు వెంటవెంటనే భారీ విజయాలను అందించాయి. తక్కువ బడ్జెట్ తో 'ప్రేమలు' .. 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలు రికార్డులను సృష్టిస్తే, తక్కువ పాత్రలతో 'భ్రమయుగం' సంచలనం సృష్టించింది. ఈ ఏడాది కూడా మళయాలంలో అదే జోరు కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తమిళ సినిమాలు కూడా ఇదే తరహా కంటెంట్ ను అందించడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. ఆ జాబితాలో మనకి 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఒకటిగా కనిపిస్తోంది. శశికుమార్ .. సిమ్రన్ .. యోగిబాబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథలో, శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడటంతో ధర్మదాసు ఫ్యామిలీ బ్రతకడం కోసం భారత్ లోకి ప్రవేశిస్తుంది. తాము ఎక్కడి నుంచి వచ్చింది బయటికి చెప్పకుండా, చుట్టుపక్కలవారి నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందనేది కథ. వినోదం - సందేశం కలిసి నడిచే ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయాల్లో బదిలీలకు మార్గదర్శకాలు జారీ! కొత్త రూల్ అమలు, ఇక అలా కుదరదు!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Tourist Family #Sasikumar Simran #Yogi Babu #Tamil Cinema #Kollywood #Sri Lanka economic crisis #Abhishek Jeevanth #Box Office Collection #Tamil movie review
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.